Team India: టీమిండియా సెలక్టర్ల పోస్టులకు సచిన్, సెహ్వాగ్, ధోనీ దరఖాస్తులు.. అసలు విషయం ఏమిటంటే..!

BCCI receives applications in the name of Sachin and Dhoni
షార్ట్స్‌లో చూడండి
టీమిండియా సెలక్టర్ల కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. సెలక్షన్ ప్యానల్ లోని ఐదు పోస్టుల కోసం 600 ఈమెయిల్ అప్లికేషన్లు వచ్చాయి. వీటిని ఓపెన్ చేసిన అధికారులు షాక్ కు గురయ్యారు. ఎందుకంటే సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, మహేంద్ర సింగ్ ధోనీ పేరిట కూడా దరఖాస్తులు రావడమే దీనికి కారణం. అంతేకాదండోయ్... పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్ నుంచి కూడా అప్లికేషన్ వచ్చింది.

 అసలు విషయం ఏమిటంటే ఇవన్నీ తప్పుడు దరఖాస్తులు. స్పామ్ ఈమెయిల్ ఐడీల నుంచి కొందరు ఆకతాయిలు వీటిని పంపించారు. మరోవైపు తమకు వచ్చిన దరఖాస్తుల్లో 10 మంది హైప్రొఫైల్ క్యాండిడేట్లను బీసీసీఐ ఎంపిక చేయనుంది. ఆ తర్వాత వీరికి ఇంటర్వ్యూలను నిర్వహించి ఐదుగురిని సెలెక్ట్ చేయనుంది.
Go Back to Shorts
Team India
BCCI
Sachin Tendulkar
Virender Sehwag
Inzamam

More Telugu News