ఈ ఏడాదిలో రవితేజకి ఉన్న ఛాన్స్ ఇదొక్కటే!
- ఈ ఏడాదిలో రెండు ఫ్లాపులతో ఉన్న రవితేజ
- ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'ధమాకా'
- ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న శ్రీలీల గ్లామర్
- ఈ నెల 23వ తేదీన విడుదలవుతున్న సినిమా
ఇక ఏడాది మధ్యలో 'రామారావు ఆన్ డ్యూటీ' వచ్చింది. టైటిల్ తోనే ఈ సినిమా ఆసక్తిని రేకెత్తించింది. శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా రవితేజ అభిమానులను నిరాశ పరిచింది. ఇది రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగిన కథనే .. ఆయనకి సెట్ అయ్యే పాత్రనే. అయితే కొన్ని కారణాల వలన ఇది అభిమానులను సంతృప్తి పరచలేకపోయింది.
ఈ నేపథ్యంలోనే ఈ ఏడాదిలో రవితేజ నుంచి మూడో సినిమాగా 'ధమాకా' వస్తోంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా, రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రినాథరావుకి మాస్ కంటెంట్ పై ఉన్న పట్టు .. రవితేజ మార్కు కామెడీ .. శ్రీలీల గ్లామర్ ఈ సినిమాకి ప్రధానమైన ఆకర్షణ అంటున్నారు. ఈ ఏడాదిలో రవితేజ హిట్ అనే మాట వినడానికి ఉన్న ఛాన్స్ ఈ సినిమా ఒక్కటే. ఆయన ఫ్లాపులకు ఈ సినిమా అడ్డుకట్ట వేస్తుందేమో చూడాలి.