చిక్కుల్లో అలనాటి నటి జయప్రద.. ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
- 2019 లోక్ సభ ఎన్నికల్లో యూపీలో జయప్రదపై రెండు కేసులు
- విచారణకు హాజరుకాకపోవడంతో వారెంట్ జారీ చేసిన రాంపూర్ కోర్ట్
- రాంపూర్ లోక్ సభ ఎన్నికలో ఓడిపోయిన జయప్రద
వచ్చే మంగళవారం విచారణకు ఆమెను కోర్టులో హాజరు పరచాలని రాంపూర్ ఎస్పీని ఆదేశించింది. ఈ మేరకు జయప్రదకు వారెంట్ జారీ అయినట్టు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. కాగా, ఎన్నికల్లో రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసిన జయప్రద సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఆజం ఖాన్ చేతిలో పరాజయం చెందారు.