మణిపూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం... 15 మంది బాలికల దుర్మరణం
- మణిపూర్ లో విషాదం
- నోనీ జిల్లా లాంగ్ సాయ్ వద్ద దుర్ఘటన
- బోల్తా పడిన విద్యార్థుల బస్సు
- విజ్ఞాన యాత్రకు వెళుతున్న విద్యార్థులు
ఈ విద్యార్థులంతా యారిపోక్ లోని తంబాల్ను హయ్యర్ సెకండరీ స్కూలుకు చెందినవారు. ఎడ్యుకేషనల్ టూర్ నిమిత్తం రెండు బస్సుల్లో ఖౌపుమ్ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటన స్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.