ఎప్పుడో ఛాలెంజ్ చేస్తే ఇప్పుడా స్పందించేది? మంత్రి కేటీఆర్ ను నిలదీసిన బండి సంజయ్
- డ్రగ్స్ కేసులో సిట్ నివేదిక బయటపెట్టాలని డిమాండ్
- కేటీఆర్ ముఖంలో భయం కనిపిస్తోందన్న బండి సంజయ్
- వేములవాడకు కేసీఆర్ ఇస్తానన్న రూ.400 కోట్లు ఎక్కడని మంత్రికి ప్రశ్న
- లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రపై మాట్లాడడం లేదెందుకని నిలదీత
డ్రగ్స్ కేసు విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇచ్చిన నివేదిక ఏదని మంత్రి కేటీఆర్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. ఆ రిపోర్టులో ఏముందో బయటకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. వేములవాడ ఆలయానికి రూ.400 కోట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఆ సొమ్ము ఎక్కడ? అని కేటీఆర్ ను ప్రశ్నించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరుపై రేగుతున్న దుమారాన్నీ బండి సంజయ్ ప్రస్తావించారు. లిక్కర్ స్కాంలో కవిత పాత్రపైన మాట్లాడడంలేదు ఎందుకని కేటీఆర్ ను సంజయ్ నిలదీశారు. బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులను విచారించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తాను తంబాకు తింటాననేందుకు ఆధారాలు ఏమైనా ఉంటే బయటపెట్టాలని బండి సంజయ్ మంత్రి కేటీఆర్ కు సవాల్ విసిరారు.