రేపు తెలంగాణలో టీడీపీ సభ... హాజరుకానున్న చంద్రబాబు

Chandrababu will attend Khammam rally tomorrow
రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో టీడీపీ బలహీనపడింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కొందరు నేతలు అప్పటి టీఆర్ఎస్ లో చేరగా, విభజన తర్వాత మరికొందరు కాంగ్రెస్ బాటపట్టారు. దాంతో తెలంగాణలో టీడీపీకి సరైన నాయకత్వమే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో, తెలంగాణ టీడీపీని పునరుద్ధరించడంపై పార్టీ అధినేత చంద్రబాబు దృష్టి సారించారు. 

ఈ క్రమంలో, రేపు ఖమ్మంలోని సర్దార్ పటేల్ మైదానంలో టీడీపీ సభ ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ శంఖారావం పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ బహిరంగ సభకు చంద్రబాబు హాజరవుతున్నారు. హైదరాబాద్ నుంచి భారీ వాహనశ్రేణితో ఈ సభకు ఆయన వెళ్లనున్నారు. 

కాగా, ఖమ్మం సభకు 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో సభలకు టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Go Back to Shorts
Chandrababu
Khammam
Rally
Telangana TDP

More Telugu News