రేపు తెలంగాణలో టీడీపీ సభ... హాజరుకానున్న చంద్రబాబు
- టీడీపీ శంఖారావం పేరిట సభ
- ఖమ్మం సర్దార్ పటేల్ మైదానంలో బహిరంగ సభ
- హైదరాబాద్ నుంచి భారీ వాహనశ్రేణితో వెళ్లనున్న చంద్రబాబు
- అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో సభలకు టీడీపీ ప్రణాళిక
ఈ క్రమంలో, రేపు ఖమ్మంలోని సర్దార్ పటేల్ మైదానంలో టీడీపీ సభ ఏర్పాటు చేస్తున్నారు. టీడీపీ శంఖారావం పేరుతో ఏర్పాటు చేస్తున్న ఈ బహిరంగ సభకు చంద్రబాబు హాజరవుతున్నారు. హైదరాబాద్ నుంచి భారీ వాహనశ్రేణితో ఈ సభకు ఆయన వెళ్లనున్నారు.
కాగా, ఖమ్మం సభకు 25 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేపట్టనున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో సభలకు టీడీపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.