విజయవాడకు 150 కి.మీ. వేగంతో దూసుకుపోయే హైస్పీడ్ రైలు
- విజయవాడకు వందేభారత్ ఎక్స్ ప్రెస్ కేటాయింపు
- బెజవాడ నుంచి సికింద్రాబాద్ లేదా వైజాగ్ కు సర్వీసులు
- విమానంలో ప్రయాణించే అనుభూతిని కలిగించే వందేభారత్ రైళ్లు
వాస్తవానికి వందేభారత్ ఎక్స్ ప్రెస్ లకు 200 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే సామర్థ్యం ఉంది. అయితే, 180 కిలోమీటర్లకు ఈ రైళ్లకు రైల్వే అధికారులు సర్టిఫై చేశారు. ట్రాక్ బలాన్ని బట్టి ఈ రైళ్లు గరిష్ఠంగా 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వీలుంది. ఈ రైళ్లు సాధారణ ట్రైన్స్ మాదిరి కాకుండా ఏరో డైనమిక్ షేప్ లో ఉంటాయి. కోచ్ లు కూడా అత్యంత అధునాతనంగా ఉంటాయి. కోచ్ లలో ఎల్ఈడీ టీవీలు, వైఫై సదుపాయం, రీడింగ్ లైట్స్, పెద్దపెద్ద కిటికీలు, రొటేట్ అయ్యే సీట్లు తదితర సదుపాయాలు అదనంగా ఉంటాయి. ఆటోమేటిక్ డోర్లు ఉంటాయి. బయో వాక్యూమ్ టాయ్ లెట్స్, సెన్సార్ వాటర్ ట్యాప్స్, సీసీ టీవీ కెమెరాల వంటివి కూడా ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే విమానంలో ప్రయాణిస్తున్న అనుభూతి కలుగుతుంది.