Macherla: మాచర్ల పట్టణంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు

Section 144 in Macherla
  • మాచర్లలో గతరాత్రి తీవ్ర ఉద్రిక్తత
  • టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు
  • అదనపు పోలీసు బలగాల మోహరింపు
పల్నాడు జిల్లా మాచర్లలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు, ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పట్టణంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. ప్రజలు గుంపులుగా తిరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. 

మాచర్ల పరిణామాలపై పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి స్పందించారు. కొందరు రెచ్చగొట్టే పనులు చేశారని వెల్లడించారు. రెండు పార్టీల కార్యకర్తలకు సంబంధించిన వీడియో ఫుటేజిలను పరిశీలిస్తున్నామని తెలిపారు. పోలీసుల వైఫల్యం ఎక్కడా కనిపించలేదని స్పష్టం చేశారు. బాధితులెవరూ ఫిర్యాదు చేయలేదని పేర్కొన్నారు. దాడుల్లో ఎవరు పాల్గొన్నారో పరిశీలిస్తున్నామని ఎస్పీ చెప్పారు.

అటు, పిడుగురాళ్లలో టీడీపీ శాంతియుత ర్యాలీ చేపట్టింది. మాచర్ల దాడులను నిరసిస్తూ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. అదే సమయంలో వైసీపీ కూడా ర్యాలీ చేపట్టింది. ఓ దశలో ఇరు పార్టీల ర్యాలీలు ఎదురుపడడంతో స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. 

Macherla
144 Section
Police
TDP
YSRCP
Palnadu District

More Telugu News