Nani: హీరోగా ఈ ఏడాది హిట్ అందుకోలేకపోయిన నాని!

Nani Special
  • వరుస సినిమాలు చేస్తూ వెళుతున్న నాని 
  • ఆయనకి పెరుగుతున్న ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు
  • ఈ ఏడాది నిరాశను మిగిల్చిన 'అంటే .. సుందరానికీ'  
  • వచ్చే ఏడాదిలో విడుదల కానున్న 'దసరా' సినిమా 
మొదటి నుంచి కూడా నాని విభిన్నమైన .. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతును పెంచుకుంటూ వెళుతున్నాడు. నిన్నమొన్నటి వరకూ కేవలం కథాపరమైన వైవిధ్యానికి మాత్రమే ప్రాధాన్యతనిస్తూ వచ్చిన నాని, ఇక ఇప్పుడు లుక్ పరంగా కూడా కొత్తదనానికి ప్రాముఖ్యతనిస్తున్నాడు. ఇటీవల కాలంలో ఆయన డిఫరెంట్ లుక్ తో కనిపించిన సినిమాగా 'శ్యామ్ సింగ రాయ్' గురించి చెప్పుకోవచ్చు. 

అయితే ఈ సినిమా తరువాత నాని చేసిన 'అంటే .. సుందరానికి' సినిమాలోను ఆయన లుక్ పరంగా కొత్తగానే కనిపించాడు. అయితే కథాకథనాలు తేడా కొట్టడంతో ఆ సినిమా పరాజయం పాలైంది. ఒకానొక సమయంలో వరుసగా ఆరు హిట్లు అందుకున్న నాని, 'శ్యామ్ సింగరాయ్' కి ముందు మూడు ఫ్లాపులను మూటగట్టుకున్నాడు. ఈ ఏడాదిలో చేసిన ఒక్క సినిమా కూడా ఆయన అభిమానులను నిరాశ పరిచింది. 

ఇక ప్రస్తుతం నాని సినిమా 'దసరా' మాత్రమే పట్టాలపై ఉంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, వచ్చే మార్చిలో విడుదల కానుంది. ఈ సినిమాపై నాని గట్టి ఆశపెట్టుకున్నాడు. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ కొడుతుందనే నమ్మకంతో ఉన్నాడు. గట్టిపోటీ ఉన్న ఈ సమయంలో ఈ హిట్ ఆయనకి చాలా అవసరం కూడా. ఈ ఏడాది హీరోగా హిట్ అందుకోలేకపోయినా, 'హిట్ 2' సినిమాతో హిట్ అందుకోవడం ఆయనకి ఊరటనిచ్చే విషయంగా చెప్పుకోవాలి.
Nani
Dasara Movie
Tollywood

More Telugu News