అవతార్ కు రూ.20 కోట్ల టికెట్లు ముందే బుకింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అవతార్ కు రూ.20 కోట్ల టికెట్లు ముందే బుకింగ్

Avatar The Way of Water advance booking crosses Rs 20 crore in India tickets worth over Rs 2500 sold out in several cities
  • తొలి రోజు రూ.40-50 కోట్ల కలెక్షన్లు ఉంటాయని అంచనా
  • భారత్ లో ఈ ఘనత ఈ చిత్రానికే సొంతం
  • సినిమా పట్ల పెరిగిపోతున్న ఆసక్తి
అవతార్-2 (ద వే ఆఫ్ వాటర్)  సినిమా శుక్రవారం విడుదల అవుతుండగా, బాక్సాఫీసు వద్ద భారీ సందడి నెలకొంది. అడ్వాన్స్ బుకింగ్ లో రూ.20 కోట్ల విలువైన టికెట్లు అమ్ముడుపోయాయి. ఈ తరహా రికార్డు ఈ ఏడాది కేజీఎఫ్ చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్, బ్రహ్మాస్త్ర తదితర చిత్రాలకే సాధ్యమైంది.

గురువారం రాత్రి నాటికి రూ.20 కోట్ల అడ్వాన్స్ బుకింగ్ లు జరిగినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది టాప్ 5 అడ్వాన్స్ కలెక్షన్లలో ఇది కూడా ఒకటి. అయినా కానీ, కేజీఎఫ్ చాప్టర్ 2 రూ.80 కోట్ల కంటే చాలా దిగువనే ఉంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ఐమ్యాక్స్ థియేటర్లలో ఒక్కో టికెట్ రూ.2,500-3,000 కూడా అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. 

శుక్రవారం తొలి రోజు దేశవ్యాప్తంగా అవతార్-2 సినిమా రూ. 40-50 కోట్లను వసూలు చేయచ్చని అంచనా. మరే హాలీవుడ్ సినిమాకు భారత్ లో ఈ ఘనత సాధ్యపడలేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సానుకూల అభిప్రాయాలు, రివ్యూలు వస్తుండడంతో, ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమా పైరసీ కాపీ లీక్ అయినట్టు సమాచారం వ్యాప్తి చెందుతోంది. అయితే గ్రాఫిక్స్ ఆధారిత చిత్రం కనుక థియేటర్లలో చూసిన అనుభవం ఫోన్లలో, కంప్యూటర్లలో చూసినప్పుడు ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Advertisement
Avatar 2
The Way of Water
advance booking
Rs 20 crore
release
first day
collections

More Telugu News