పాల్వంచలో స్వల్ప భూకంపం... పరుగులు తీసిన ప్రజలు
- మధ్యాహ్నం 2.13 గంటలకు ప్రకంపనలు
- ఇళ్లలోని వస్తువులు కిందపడిపోయిన వైనం
- శబ్దాలు కూడా వచ్చాయన్న స్థానికులు
- రిక్టర్ స్కేలుపై 3.2 తీవ్రత నమోదు
ఈ మధ్యాహ్నం 2.13 గంటల సమయంలో ఒక్కసారిగా భూకంపం రావడంతో పాల్వంచలో భయాందోళనకర పరిస్థితి నెలకొంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.2గా నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.