మడకశిర నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి పోస్టర్ల చింపివేత
- మడకశిరలో రెండు వర్గాలుగా విడిపోయిన వైసీపీ
- ఎమ్మెల్యే తిప్పేస్వామిని వ్యతిరేకిస్తున్న అసమ్మతి వర్గం
- మంత్రికి విడివిడిగా స్వాగతం పలికిన రెండు వర్గాలు
ఎమ్మెల్యే తిప్పేస్వామి వర్గం పెద్దిరెడ్డి ఫ్లెక్సీలను మడకశిరలో ఏర్పాటు చేసింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. తిప్పేస్వామి వ్యతిరేకవర్గం ఈ పనికి పాల్పడిందని అంటున్నారు. కాసేపటి క్రితమే మడకశిరకు పెద్దిరెడ్డి చేరుకున్నారు. ఈ సందర్భంగా కూడా ఎమ్మెల్యే వర్గీయులు, వ్యతిరేక వర్గీయులు విడిపోయి మంత్రికి స్వాగతం పలికారు. రెండు వర్గాల నేతలు, కార్యకర్తలు మంత్రికి వేర్వేరు ప్రాంతాల్లో స్వాగతం పలకడం గమనార్హం.