కీరవాణి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి: పవన్ కల్యాణ్
- సంగీత దర్శకుడు కీరవాణికి మాతృవియోగం
- అనారోగ్యంతో కీరవాణి తల్లి భానుమతి కన్నుమూత
- విచారం వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్
- రేపు భానుమతి అంత్యక్రియలు
శివశక్తి దత్తా, భానుమతి దంపతులకు ఆరుగురు సంతానం. అందరిలోకి కీరవాణి పెద్దవాడు కాగా, కల్యాణ్ కోడూరి, శ్వేతనాగ, మల్లీశ్వరి, కాంచి, సప్తమి ఇతర సంతానం.
కాగా, భానుమతి అంత్యక్రియలు రేపు హైదరాబాదులో నిర్వహించనున్నారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పవన్ కల్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.