'వారసుడు' ప్రీ రిలీజ్ ఈవెంటుకి చీఫ్ గెస్టుగా పవన్ కల్యాణ్?
- ద్విభాషా చిత్రంగా రూపొందిన 'వారసుడు'
- విజయ్ జోడీగా మెరవనున్న రష్మిక
- ఈ నెల 27వ తేదీన జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్
- జనవరి 12వ తేదీన సినిమా రిలీజ్
ఈ రెండు భాషల్లో ఒకే సమయంలో ఆయన చేసిన ఆ సినిమా, తెలుగులో 'వారసుడు' .. తమిళంలో 'వరిసు' పేరుతో పలకరించనుంది. ఈ రెండు భాషల్లోను ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు. కోలీవుడ్ లో అయితే ఓకేగానీ, తెలుగులో అయితే అదే రోజున బాలకృష్ణ 'వీరసింహారెడ్డి' .. ఆ తరువాత రోజున చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' విడుదల కానున్నాయి.
ఇటు చిరంజీవి .. అటు బాలయ్య ఇద్దరి సినిమాలకి మంచి బజ్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో విజయ్ సినిమా వస్తుండటం విశేషం. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటుకి చీఫ్ గెస్టుగా కల్యాణ్ వస్తున్నాడనేది తాజా సమాచారం. తెలుగు వెర్షన్ కి సంబంధించి ఈ నెల 27వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్టు చెబుతున్నారు. రష్మిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో శరత్ కుమార్ .. ప్రకాశ్ రాజ్ .. శ్రీకాంత్ ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.