'బాహుబలి'తో బాలయ్య షో ఫస్ట్ గ్లింప్స్ అదుర్స్.. వీడియో ఇదిగో!
- అన్ స్టాపబుల్ షోలో పాల్గొన్న ప్రభాస్
- గోపీచంద్ తో కలిసి వచ్చిన రెబల్ స్టార్
- ఈ ఎపిసోడ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులు
ఈ ఎపిసోడ్ కు సంబంధించిన చిత్రీకరణ ఈ మధ్యే పూర్తయింది. తన స్నేహితుడు, హీరో గోపీచంద్ తో కలిసి ప్రభాస్ ఈ షోలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ ఎపిసోడ్ నుంచి 43 సెకన్ల నిడివి గల చిన్న గ్లింప్స్ ను ఆహా విడుదల చేసింది. బాలయ్యను కలిసిన బాహుబలి అంటూ మొదలైన ఈ గ్లింప్స్ లో ప్రభాస్ ను బాలకృష్ణ ఆప్యాయంగా హత్తుకున్నారు. నవ్వుతూ హుషారుగా కనిపించిన ప్రభాస్ ను బాలకృష్ణ ఆటపట్టిస్తూ కనిపించారు. త్వరలో మొయిన్ ప్రోమో విడుదల కానుంది. ఈ ఎపిసోడ్ ఎప్పుడు స్ట్రీమ్ అవుతుందో తెలియాల్సి ఉంది.