హోటల్ గదిలో విద్యార్థినికి మత్తుమందు ఇచ్చి ప్రిన్సిపాల్ అత్యాచారం!
- ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఘటన
- టూర్ కోసం 9 మంది బాలికలను బృందావన్ తీసుకెళ్లిన ప్రిన్సిపాల్
- 11వ తరగతి అమ్మాయిపై అత్యాచారం
- ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరింపు
బాలిక ప్రతిఘటించడంతో ప్రిన్సిపాల్ ఆమెను బెదిరించాడు. పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. టూర్ ముగిసిన అనంతరం 24న విద్యార్థినులను తీసుకుని ప్రిన్సిపాల్ వెనక్కి వచ్చాడు. ఆ తర్వాత బాధిత బాలిక జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.