సంక్రాంతి సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ తీపి కబురు.. 4,233 ప్రత్యేక బస్సులు!
- జనవరి 7 నుంచి 15 వరకు అందుబాటులో ప్రత్యేక బస్సులు
- 60 రోజుల ముందుగానే రిజర్వేషన్ చేసుకునే సదుపాయం
- అమలాపురం, విశాఖ సహా పలు ప్రాంతాలకు బస్సులు
- తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు ట్రిప్పులు
జనవరి 7వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఈ స్పెషల్ బస్సులు అందుబాటులో ఉంటాయని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ప్రత్యేక బస్సుల్లో 125 అమలాపురానికి, 117 బస్సులు కాకినాడకు, 83 బస్సులు కందుకూరుకు, 65 విశాఖపట్టణానికి, 51 పోలవరానికి, 40 రాజమహేంద్రవరానికి నడుపుతున్నట్టు పేర్కొన్నారు. అలాగే, తెలంగాణలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలకు కూడా ప్రత్యేక బస్సులు నడుస్తాయని సజ్జనార్ తెలిపారు.