వారాన్ని నష్టాలతో ముగించిన స్టాక్ మార్కెట్లు

Markets ends in losses
  • 389 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 112 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
  • 7 శాతం వరకు నష్టపోయిన హెచ్సీఎల్ టెక్నాలజీస్
ఈ వారాన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగించాయి. అమెరికాలో నెలకొన్న ప్రతికూల పరిస్థితుల కారణంగా ఐటీ కంపెనీల స్టాక్స్ లో 10 నుంచి 27 శాతం వరకు దిద్దుబాటు ఉండే అవకాశం ఉందని క్రెడిట్ సూయిజ్ నివేదిక తెలపడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది. 

ఈ నేపథ్యంలో మదుపరులు అమ్మకాలకు మొగ్గు చూపారు. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 389 పాయింట్లు కోల్పోయి 62,181కి పడిపోయింది. నిఫ్టీ 112 పాయింట్లు నష్టపోయి 18,496 వద్ద స్థిరపడింది. ఐటీ, టెక్ సూచీలు 2 శాతానికి పైగా నష్టపోయాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
నెస్లే ఇండియా (2.24%), టైటాన్ (1.20%), సన్ ఫార్మా (1.20%), డాక్టర్ రెడ్డీస్ (1.00%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (0.88%). 

టాప్ లూజర్స్:
హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-6.72%), టెక్ మహీంద్రా (-3.58%), ఇన్ఫోసిస్ (-3.15%), విప్రో (-2.39%), టీసీఎస్ (-1.72%).
Go Back to Shorts
Sensex
Nifty
Stock Market

More Telugu News