రూ.12 వేలకే టెక్నో 5జీ స్మార్ట్ ఫోన్
- టెక్నో పోవా 4 పేరుతో విడుదల
- 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో ఒకటే వేరియంట్ గా విడుదల
- ఈ నెల 13 నుంచి అమెజాన్, జియో మార్ట్ పై విక్రయాలు
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో ఇది వస్తుంది. 6.82 అంగుళాల హెచ్ డీ ప్లస్ డాట్ ఇన్ డిస్ ప్లే, 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్, మీడియాటెక్ హీలియో జీ99 చిప్ సెట్, పాంథర్ గేమ్ ఇంజన్ 2.0, హైపర్ ఇంజన్ 2.0 లైట్ (గేమింగ్ కోసం) ఫీచర్లు ఉన్నాయి. స్టోరేజీని 2టీబీ వరకు ఎక్స్ పాండ్ చేసుకోవచ్చు.
6,000 ఎంఏహెచ్ బ్యాటరీతోపాటు, 18 వాట్ ఫాస్ట్ చార్జర్ అడాప్టర్ వస్తుంది. 10వాట్ రివర్స్ చార్జ్ సపోర్ట్ కూడా ఉంటుంది. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరా ఉంది. 10 ఎక్స్ జూమ్ తో, 2కే సపోర్ట్ వీడియోలు తీసుకోవచ్చు. ముందు భాగంలో 8 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇది కూడా 2కే వీడియోకు సపోర్ట్ చేస్తుంది. సైరోలైట్ బ్లూ, ఉరానోలిత్ గ్రే, మ్యాగ్మా ఆరెంజ్ రంగుల్లో వస్తుంది. ఈ నెల 13 నుంచి అమెజాన్, జియోమార్ట్ పై కొనుగోలు చేసుకోవచ్చు.