Himachal pradesh: గుజరాత్ లో దూసుకుపోతున్న బీజేపీ... హిమాచల్ లో బీజేపీ, కాంగ్రెస్ నువ్వా? నేనా?

  • గుజరాత్ లో 182 స్థానాలకు గాను 156 చోట్ల బీజేపీ ముందంజ
  • హిమాచల్ ప్రదేశ్ లో అధికారం కోసం 35 స్థానాల్లో గెలవడం అవసరం
  • బీజేపీ 33 చోట్ల, కాంగ్రెస్ 31 చోట్ల ఆధిక్యం
Bjp going to get huge majority in Gujarat mixed results in Himachal pradesh

గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కమల వికాసం కొనసాగుతోంది. మొత్తం 182 స్థానాలకు గాను ప్రభుత్వం ఏర్పాటుకు 92 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. బీజేపీ ఇప్పటికే 156 స్థానాల్లో ముందంజలో ఉంది. కాంగ్రెస్ కేవలం 16 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 8 స్థానాల్లో మెజారిటీ దిశగా కొనసాగుతున్నాయి. ఇతరులు రెండు స్థానాల్లో ముందంజలో ఉన్నట్టు తెలుస్తోంది.

మరోవైపు హిమాచల్ ప్రదేశ్ లో మాత్రం మెజారిటీ నీకా? నాకా? అన్నట్టు బీజేపీ, కాంగ్రెస్ మధ్య దోబూచులాడుతోంది. మొత్తం 68 స్థానాలకు గాను బీజేపీ 33 చోట్ల, కాంగ్రెస్ 31 స్థానాల్లో, ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ అధికారం కైవసం చేసుకునేందుకు 35 స్థానాల్లో గెలవాల్సి ఉంటుంది. చూడబోతుంటే ఇతరులు ఇక్కడ కీలకంగా మారనున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ, కాంగ్రెస్ మెజారిటీ 35 స్థానాలకు కొద్ది దూరంలోనే ఆగిపోయాయి. తుది కౌంటింగ్ కు వచ్చేసరికి ఈ బలాబలాలు మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

More Telugu News