పోర్చుగల్ గోల్స్ వర్షం.. చిత్తుగా ఓడిన స్విట్జర్లాండ్!
- 6-1తో స్విస్ జట్టును చిత్తు చేసిన పోర్చుగల్
- ఓటమితో ప్రపంచకప్ నుంచి స్విట్జర్లాండ్ నిష్క్రమణ
- మొరాకోతో క్వార్టర్స్‌లో తలపడనున్న పోర్చుగల్
58వ నిమిషం వద్ద స్విస్ ఆటగాడు మాన్యువల్ అకంజీ గోల్ చేయడంతో స్విట్జర్లాండ్ ఖాతా తెరిచింది. అయితే, ఆ తర్వాత పోర్చుగల్ ఆటగాళ్లు మరింతగా చెలరేగి దూకుడు ప్రదర్శించి ప్రత్యర్థి జట్టును ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. పోర్చుగల్ కంటే ఎక్కువ పాస్‌లు అందుకున్నప్పటికీ గోల్స్ చేయడంలో స్విట్జర్లాండ్ ఆటగాళ్లు విఫలమయ్యారు. ఈ ఓటమితో స్విట్జర్లాండ్ ప్రపంచకప్ నుంచి నిష్క్రమించింది. స్విస్ జట్టును చిత్తు చేసిన పోర్చుగల్ క్వార్టర్ ఫైనల్స్‌లో మొరాకోతో తలపడుతుంది.