Women Umpires: మహిళా అంపైర్ల విషయంలో బీసీసీఐ కీలక నిర్ణయం

  • పురుషులకు దీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు
  • మహిళలకు అంపైర్లుగా అవకాశం కల్పించిన బీసీసీఐ
  • త్వరలో జరగనున్న రంజీ ట్రోఫీలో కనిపించనున్న విమెన్ అంపైర్స్
BCCI decides to give women as umpires

ప్రస్తుత కాలంలో పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. ఒకప్పుడు వంటింటికే పరిమితం అని అనిపించుకున్న మహిళలకు ఇప్పుడు అన్ని రంగాల్లో సమాన అవకాశాలు లభిస్తున్నాయి. దీంతో, వారు బయటకు వచ్చి వారి శక్తిని ప్రపంచానికి చాటుతున్నారు. మహిళల విషయంలో ఇండియన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు అంపైర్లుగా అవకాశం కల్పించాలని నిర్ణయించింది. త్వరలో ప్రారంభం కానున్న రంజీ ట్రోఫిలో మహిళా అంపైర్లు కనిపించనున్నారు. 

మన దేశంలో ప్రస్తుతం గాయత్రి, జనని, వృందారతి అనే మహిళా అంపైర్లు సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో మహిళా అంపైర్ల సంఖ్యను మరింత పెంచాలని బీసీసీఐ నిర్ణయించింది. భవిష్యత్తులో అంతర్జాతీయ క్రికెట్ లో సైతం మహిళా అంపైర్లు కనిపిస్తారని బీసీసీఐ అధికారులు తెలిపారు. బీసీసీఐ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతోంది.

More Telugu News