వన్డే సిరీస్కు దూరమైన పంత్.. కుల్దీప్ సేన్ అరంగేట్రం
- తొలి వన్డేకు దూరంగా అక్షర్ పటేల్
- కేఎల్ రాహుల్ కు కీపింగ్ బాధ్యతలు
- టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్
అలాగే, స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ తొలి వన్డేకు అందుబాటులో ఉండటం లేదని తెలిపింది. కాగా, తొలి వన్డేలో భారత్ టాస్ ఓడిపోయింది. టాస్ నెగ్గిన బంగ్లాదేశ్ బౌలింగ్ ఎంచుకుంది. భారత జట్టు యువ పేసర్ కుల్దీప్ సేస్ కు అరంగేట్రం అవకాశం కల్పించింది. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శిఖర్ ధవన్ ను తీసుకుంది. కీపర్ గా కేఎల్ రాహుల్ కు బాధ్యతలు అప్పగించింది.
తుది జట్లు:
భారత్: 1. రోహిత్ శర్మ (కెప్టెన్), 2. శిఖర్ ధవన్, 3. విరాట్ కోహ్లీ, 4. శ్రేయస్ అయ్యర్, 5. కేఎల్ రాహుల్ (కీపర్), 6. వాషింగ్టన్ సుందర్, 7. షాబాజ్ అహ్మద్, 8. శార్దూల్ ఠాకూర్, 9. దీపక్ చహర్, 10. మహ్మద్ సిరాజ్, 11. కుల్దీప్ సేన్
బంగ్లాదేశ్: 1. లిట్టన్ దాస్ (కెప్టెన్), 2. అనముల్ హక్, 3. నజ్ముల్ హొస్సేన్ శాంటో, 4. షకీబ్ అల్ హసన్, 5. ముష్ఫికర్ రహీమ్ (కీపర్), 6. మహ్మదుల్లా, 7. అఫీఫ్ హొస్సేన్, 8. మెహిదీ హసన్ మిరాజ్, 9. హసన్ మహ్మద్, 10. ముస్తాఫిజుర్ రహ్మన్, 11. ఎబాడట్ హుస్సేన్.