తెలుగులో 50 రోజులను పూర్తి చేసుకున్న 'కాంతార'
- రిషభ్ శెట్టి హీరోగా రూపొందిన 'కాంతార'
- తెలుగులో అక్టోబర్ 15న విడుదలైన సినిమా
- ఈ రోజుతో 50 రోజులు పూర్తి
- కథా కథనాలే ప్రధాన బలంగా నిలిచిన సినిమా
- ఓటీటీ వైపు నుంచి కూడా భారీ రెస్పాన్స్
తెలుగులో ఈ సినిమాను అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. అక్టోబర్ 15వ తేదీన ఇక్కడ థియేటర్లలో దిగిపోయిన ఈ సినిమా, తొలి రోజునే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఆ తరువాత నుంచి చాలా రోజుల పాటు అదే వసూళ్ల జోరును కొనసాగించింది. మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
అలాంటి ఈ సినిమా తెలుగులో ఈ రోజుతో 50 రోజులను పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా కొంతసేపటి క్రితం అందుకు సంబంధించిన పోస్టర్ ను వదిలారు. అడవి ప్రాంతంలోని ఆచార విశ్వాసాలకు సంబంధించిన కథనే అయినా, మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా .. సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించడమే ఈ సినిమా ఇంతటి విజయాన్ని సాధించడానికి ప్రధానమైన కారణమని చెప్పుకోవచ్చు.