600 మంది ఉద్యోగులను తొలగించనున్న ఓయో

OYO to terminate 600 employees
ఎంఎన్సీలలోనే కాకుండా దేశీయ కంపెనీల్లో సైతం ఉద్యోగుల తొలగింపులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే జొమాటో, బైజూస్ వంటి కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. తాజాగా ఆతిథ్య సేవలు అందించే ఓయో సంస్థ సైతం ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. టెక్నాలజీ, కార్పొరేట్ విభాగానికి చెందిన 600 మంది ఉద్యోగులను తొగించబోతున్నట్టు తెలిపింది. ఇదే సమయంలో రిలేషన్ షిప్ మేనేజ్ మెంట్ టీమ్ లోకి కొత్తగా 250 మందిని తీసుకోనున్నట్టు వెల్లడించింది. తొలగించిన ఉద్యోగులకు 3 నెలల పాటు మెడికల్ ఇన్స్యూరెన్స్ కొనసాగుతుందని తెలిపింది. భవిష్యత్తులో ఉద్యోగ నియామకాలు చేపడితే తొలగించిన ఉద్యోగులకు ప్రాధాన్యతను ఇస్తామని పేర్కొంది.
Go Back to Shorts
OYO
Employees
Layoff

More Telugu News