సంకల్ప సిద్ధి కేసుతో నాకు, కొడాలి నానికి సంబంధం లేదు: వల్లభనేని వంశీ
- విజయవాడ కేంద్రంగా వెలుగు చూసిన సంకల్ప సిద్ధి కేసు
- ఈ కేసు వ్యవహారంపై డీజీపీని కలిసిన గన్నవరం ఎమ్మెల్యే
- నిష్పక్షపాత విచారణ జరపాలని డీజీపీని కోరానన్న వంశీ
- టీడీపీ నేతలు పట్టాభి, బచ్చుల అర్జునుడులపై ఫిర్యాదు చేసినట్లు వెల్లడి
సంకల్ప సిద్ధి కేసులో ఆధారాలు లేకుండానే తనపై ఆరోపణలు చేశారంటూ వంశీ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసుతో తనకు గానీ, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి గానీ ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు. ఈ కేసులో తనకు సంబంధం ఉందని ఆధారాలు ఉంటే... ఎలాంటి శిక్షకు అయినా సిద్ధంగా ఉన్నానని కూడా ఆయన అన్నారు. ఈ కేసులో విజయవాడకు చెందిన టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరాం, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడు బచ్చుల అర్జునుడులపై డీజీపీకి ఫిర్యాదు చేశానని వంశీ పేర్కొన్నారు.