నకిలీ సీబీఐ అధికారికి బంగారం, డబ్బు ఇచ్చిన హైదరాబాదీ వ్యాపారవేత్తలకు సీబీఐ నోటీసులు
- ఇప్పటికే ఈ వ్యవహారంలో మంత్రి గంగులకు సీబీఐ నోటీసులు
- గురువారం సీబీఐ విచారణకు హాజరైన గంగుల
- సోమవారం విచారణకు రావాలంటూ వ్యాపారవేత్తలకు సీబీఐ నోటీసులు
ఓ వైపు గంగుల కమలాకర్ విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఈ వ్యవహారంలో మరో నలుగురు బడా వ్యాపారవేత్తలకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. వచ్చే సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని సదరు వ్యాపారులను సీబీఐ ఆదేశించింది. తానో సీబీఐ అధికారిని అని శ్రీనివాసరావు చెప్పడంతోనే... భయపడిపోయిన హైదరాబాద్ కు చెందిన నలుగురు వ్యాపారవేత్తలు ఆయనకు బారీ ఎత్తున డబ్బుతో పాటు బంగారాన్ని అందజేశారు. ఈ వ్యవహారం బయటపడటంతోనే సదరు వ్యాపారవేత్తలకు సీబీఐ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.