మునిగిపోయే కాంగ్రెస్ కు మేమెందుకు మద్దతు ఇవ్వాలి?: సీపీఐ నేత కూనంనేని సాంబశివరావు
- టీఆర్ఎస్ తో పొత్తు శాశ్వతమేమీ కాదన్న కూనంనేని
- పాలేరు లాంటి నియోజకవర్గాల్లో గెలిచేందుకు యత్నం
- ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా ఎర్రజెండాలు కనిపిస్తాయని వ్యాఖ్య
టీఆర్ఎస్ తో పొత్తు శాశ్వతమేమీ కాదని కూనంనేని సాంబశివరావు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందని ఇప్పుడే చెప్పలేమని కూడా ఆయన తెలిపారు. తమకు మంచి పట్టు ఉన్న పాలేరు లాంటి నియోజకవర్గాల్లో గెలిచేందుకు యత్నిస్తామని చెప్పారు. ఇక కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలపై స్పందించిన కూనంనేని... ముగినిపోయే కాంగ్రెస్ కు తామెలా మద్దతిస్తామని అన్నారు. ఎర్ర జెండాలు ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా కనిపిస్తాయని ఆయన అన్నారు.