కొరియన్ మహిళా యూట్యూబర్‌పై ముంబైలో వేధింపులు.. వీడియో ఇదిగో!
- లైవ్‌స్ట్రీమింగ్‌లో ఘటన
- వద్దువద్దంటున్నా బైక్ వద్దకు లాక్కెళ్లే యత్నం
- వీడియో వైరల్ కావడంతో ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ వీడియోను రీట్వీట్ చేసిన బాధిత యువతి.. ఆ యువకుడితోపాటు మరో వ్యక్తి ఉండడంతో పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించానని చెప్పింది. గత రాత్రి తాను లైవ్ స్టీమ్‌లో ఉండగా ఈ ఘటన జరిగినట్టు వివరించింది. తాను మరీ అంత స్నేహపూర్వకంగా ఉండడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని కొందరు చెప్పారని, దీంతో స్ట్రీమింగ్ గురించి ఆలోచించాల్సి వస్తోందని వాపోయింది. కాగా, వీడియో వైరల్ కావడంతో స్పందించిన పోలీసులు తమంత తామే కేసు నమోదు చేసి ఆమెను వేధింపులకు గురిచేసిన ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు.