స్వలింగ వివాహాలకు అమెరికన్ సెనేట్ ఆమోదం
- 11 మంది రిపబ్లికన్ సభ్యులు సైతం మద్దతు
- ప్రతినిధుల సభలో ఆమోదం తర్వాత అధ్యక్షుడి సంతకం
- ప్రేమ అంటే ప్రేమే అన్న అధ్యక్షుడు బైడెన్
సెనేట్ ఆమోదం నేపథ్యంలో ఈ బిల్లును ప్రతినిధుల సభకు పంపిస్తారు. అక్కడ ఆమోదం తర్వాత అమెరికా అధ్యక్షుడి సంతకం కోసం బిల్లు వెళుతుంది. అధ్యక్షుడి ఆమోదంతో చట్టరూపం దాలుస్తుంది. అమెరికాలో ఒకే లింగానికి చెందిన వారు వివాహం చేసుకుంటే ప్రస్తుతం రక్షణ ఉంది. 2015 నుంచి సుప్రీంకోర్టు స్వలింగ వివాహాలకు రక్షణ కల్పిస్తోంది.
గర్భ విచ్ఛిత్తి హక్కును ఈ ఏడాది జూన్ లో సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో తమ విషయంలోనూ అదే పరిస్థితి రావచ్చన్న ఆందోళన అక్కడి స్వలింగ సంపర్కుల్లో ఉంది. దీంతో డెమోక్రాట్లు ఆగమేఘాల మీద ఈ బిల్లుకు మార్గం చూపించారు. రెండు వేర్వేరు జాతుల మధ్య వివాహానికి కూడా ఈ చట్టం కింద ఆమోదం ఉంటుంది.