అలీ కుమార్తె ఫాతిమా పెళ్లి రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్
- గత ఆదివారం అలీ కుమార్తె వివాహం
- నేడు గుంటూరులో రిసెప్షన్
- శ్రీ కన్వెన్షన్ లో వివాహ విందు
- వధూవరులను ఆశీర్వదించిన సీఎం జగన్
ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. వధూవరులకు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి తన ఆశీస్సులు అందించారు. కాగా, ఈ రిసెప్షన్ కార్యక్రమం గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేశారు. ఈ వివాహ విందుకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యారు. పలువురు రాష్ట్ర మంత్రులు కూడా హాజరైనట్టు తెలుస్తోంది.
