తెలంగాణలో ఎన్నికలు జాతకాల ఆధారంగా నడుస్తున్నాయి: సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
- రాజాసింగ్ పై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంలో ప్రేమ్ సింగ్ పిటిషన్
- రాజాసింగ్ కు ఇంకా ఏడాది పదవీకాలం ఉందని వెల్లడి
- 2018లో టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు వెళ్లిందన్న సుప్రీం
ఈ సందర్భంగా కలగజేసుకున్న సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తెలంగాణ జాతకచక్రాల ప్రకారం అన్ని గ్రహాలు కలిసి ఈ కేసును వినాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఎందుకంటే తెలంగాణలో ఎన్నికలు జాతకాల ఆధారంగా నడుస్తున్నాయని వ్యంగ్యంగా పేర్కొంది. 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లిన విషయాన్ని గుర్తు చేసింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన కోర్టు... తదుపరి విచారణను వాయిదా వేసింది.