Monkeypox Virus: మంకీపాక్స్‌కు కొత్తపేరు పెట్టిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఎందుకంటే..!

WHO recommends new name for monkeypox
  • భారత్ సహా పలు దేశాలను వణికించిన మంకీపాక్స్
  • పేరుపై ఆందోళన వ్యక్తం చేసిన పలు దేశాలు
  • జాత్యహంకారానికి తావులేని విధంగా మార్చాలని వేడుకోలు
  • ప్రపంచ నిపుణులతో సంప్రదింపుల తర్వాత పేరు మారుస్తూ డబ్ల్యూహెచ్ఓ ప్రకటన
ఈ ఏడాది భారత్ సహా పలు దేశాలను భయపెట్టిన మంకీపాక్స్‌కు కొత్త పేరు వచ్చేసింది. ఈ పేరు జాత్యహంకారానికి కారణం అవుతోందన్న ఆందోళనల నేపథ్యంలో దాని పేరును ‘ఎంపాక్స్’గా మార్చింది. ప్రపంచ నిపుణులతో పలు సంప్రదింపుల తర్వాత ఈ పేరును ప్రకటించింది. మంకీపాక్స్, ఎంపాక్స్ అనే పేర్లు ఏడాది పాటు ఉపయోగంలో ఉంటాయని, ఆ తర్వాత మంకీపాక్స్ అనే పేరు కనుమరుగవుతుందని డబ్ల్యూహెచ్ఓ వివరించింది. 

ఈ ఏడాది ప్రారంభంలో మంకీపాక్స్ వ్యాపించినప్పుడు ఆన్‌లైన్, ఇతర సెట్టింగులు, కొన్ని కమ్యూనిటీల్లో జాత్యహంకార, కళంకం కలిగించే భాషను ఉపయోగించడాన్ని గుర్తించి ఆ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థకు నివేదించారు. ఆ తర్వాత జరిగిన అనేక సమావేశాల్లో పలువురు వ్యక్తులు, దేశాలు మంకీపాక్స్ పేరుపై ఆందోళన వ్యక్తం చేశాయి. 

జాత్యహంకారానికి తావులేని విధంగా పేరును మార్చాలని డబ్ల్యూహెచ్ఓను కోరాయి. దీంతో పలు పరిశీలనలు చేసిన సంస్థ చివరికి ‘ఎంపాక్స్’ గా పేరు మార్చింది. అసాధారణంగా ఉన్న వ్యాధులకు పేర్లు కేటాయించడం తమ బాధ్యత అని ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
Monkeypox Virus
MPOX
WHO

More Telugu News