Wasim Akram: అతడు నన్నొక పనివాడిలా చూసేవాడు: వసీం అక్రమ్

  • సుల్తాన్: ఏ మెమోయిర్ పేరిట అక్రమ్ జీవితచరిత్ర
  • సంచలన విషయాలు తెలిపిన అక్రమ్
  • మాజీ సారథి సలీం మాలిక్ పై ఆరోపణలు
  • తనతో బూట్లు తుడిపించి, బట్టలు ఉతికించేవాడని వెల్లడి
Wasim Akram alleges Salim Malik that he had treated like a servant

పాకిస్థాన్ పేస్ బౌలింగ్ దిగ్గజం వసీం అక్రమ్ తన జీవితచరిత్రను సుల్తాన్: ఏ మెమోయిర్ పేరిట పుస్తకంగా తీసుకువచ్చాడు. అందులో పలు సంచలన అంశాలకు చోటిచ్చాడు. కెరీర్ మొదట్లో సీనియర్ ఆటగాడు సలీం మాలిక్ తనను ఓ పనివాడిలా చూసేవాడని అక్రమ్ ఆరోపించాడు. 

తనతో బూట్లు తుడిపించేవాడని, బట్టలు ఉతికించేవాడని, మసాజ్ చేయించుకునేవాడని వెల్లడించాడు. అంత స్వార్థపరుడ్ని ఎక్కడా చూడలేదని వ్యాఖ్యానించాడు. కాగా, సలీం మాలిక్ 1992లో కెప్టెన్సీ చేపట్టి 1995 వరకు నాయకత్వ బాధ్యతల్లో కొనసాగాడు. 

అక్రమ్ తన జీవితచరిత్రలో చేసిన ఆరోపణలపై సలీం మాలిక్ స్పందించాడు. తాను కెప్టెన్ గా ఉన్న సమయంలో వసీం అక్రమ్, వకార్ యూనిస్ తనతో మాట్లాడేవాళ్లు కాదని మాలిక్ వెల్లడించాడు. తనపై అక్రమ్ చేసిన ఆరోపణల్లో ఒక్కటీ నిజంలేదని స్పష్టం చేశాడు. జీవితకథ పుస్తకం అమ్మకాలు పెంచుకోవడం కోసమే అక్రమ్ ఇలాంటి గిమ్మిక్కులు చేస్తున్నాడని ఆరోపించాడు.

More Telugu News