ఇప్పటం పిటిషనర్లపై హైకోర్టు ఆగ్రహం... ఒక్కొక్కరికి రూ.1 లక్ష జరిమానా

High Court fined Ippatam petitioners
  • ఇప్పటం గ్రామంలో కూల్చివేతలు
  • హైకోర్టును ఆశ్రయించిన బాధితులు
  • నోటీసులు ఇవ్వకుండా కూల్చారని ఆరోపణ
  • గతంలో స్టే ఇచ్చిన కోర్టు
  • నేడు ఇరువర్గాల వాదనలు విన్న హైకోర్టు
  • నోటీసులు ఇచ్చినట్టు నిరూపించిన అధికారులు
ఇటీవల గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో అధికారులు పలు కూల్చివేతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే బాధితులు హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ వారికి ఊహించిన పరిణామం ఎదురైంది. 

ఇప్పటం గ్రామంలో కూల్చివేతలకు ముందు నోటీసులు ఇచ్చినా, నోటీసులు ఇవ్వలేదంటూ బాధితులు తమ పిటిషన్లలో పేర్కొనడం పట్ల హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడింది. ఈ క్రమంలో ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున జరిమానా వడ్డించింది. 

ఈ కేసులో హైకోర్టు గతంలో స్టే ఇవ్వగా, ఇవాళ ఇరువర్గాల వాదనలు విన్నది. ఇళ్ల కూల్చివేతలపై తమకు ప్రభుత్వం ముందస్తు నోటీసులు ఇవ్వలేదని పిటిషన్ దారులు పేర్కొనగా, నోటీసులు ఇచ్చిన తర్వాత ఆక్రమణలు కూల్చివేశామని ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు. ఈ సందర్భంగా, నోటీసులు ఇచ్చింది నిజమేనని హైకోర్టు గుర్తించడంతో ఇప్పటం గ్రామస్తులకు ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. 

ఈ క్రమంలో, తప్పుడు సమాచారం ఇచ్చి మధ్యంతర ఉత్తర్వులు తీసుకున్నారంటూ హైకోర్టు ఆరోపించింది. మొత్తం 14 మంది పిటిషన్ దారులకు హైకోర్టు భారీ జరినామా విధించింది. బాధితులు మాత్రం దీనిపై తమకు తగినంత అవగాహన లేదని చెబుతున్నారు..
Go Back to Shorts
AP High Court
Ippatam
Petitioners
Fine
Govt
YSRCP

More Telugu News