Rajinikanth: రజనీకాంత్ ఫ్యాన్స్ కు పండగే.. 13 కొత్త సీన్లతో ‘బాబా’ సినిమా రీ రిలీజ్

BaBa movie to Re Release on december 12th with new scenes
షార్ట్స్‌లో చూడండి
టాలీవుడ్ లో ఈ మధ్య రీ రిలీజ్ ల సందడి నడుస్తోంది. కథానాయకుల పుట్టిన రోజు పురస్కరించుకొని వారి సూపర్ హిట్ చిత్రాలను మరోసారి రిలీజ్ చేస్తుండగా.. ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ రీ రిలీజ్ సంప్రదాయం దక్షిణాదిలోని ఇతర రాష్ట్రాలకూ చేరుతోంది. ఇక డిసెంబర్ 12న సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా రజనీ నటించిన ‘బాబా’ సినిమా రీ రిలీజ్ కాబోతోంది.

 20 ఏళ్ల కిందట భారీ అంచనాలతో వచ్చిన ‘బాబా’ బాక్సాఫీసు వద్ద మురిపించలేకపోయింది. అయితే, రజినీకాంత్ స్టయిల్, డైలాగ్స్ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు మరో హైలైట్ గా నిలిచింది. దాంతో, ఈ సినిమాను రీరిలీజ్ చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. 

ఇప్పటికే ఈ సినిమాను డిజిటల్‌గా క్వాలిటీ పెంచడంతో పాటు రీ ఎడిట్‌ చేస్తున్నారు. దాదాపుగా మూడు గంటల నిడివి ఉండే  ఈ సినిమాను రీ ఎడిట్ చేస్తున్నారు. అప్పట్లో ఎడిటింగ్ లో పోయిన సన్నివేశాల్లో  13 కొత్త సీన్స్ ను రీ రిలీజ్ లో కలుపుతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే ‘బాబా’ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వనుంది. ఈ సినిమాను ప్రదర్శించేందుకు ఇప్పటికే చాలా థియేటర్లు ముందుకొస్తున్నాయి. 

అయితే, ఈ చిత్రాన్ని తమిళ్ లో మాత్రమే రీరిలీజ్ చేస్తారా? తెలుగులోనూ తీసుకొస్తారా? అనేదానిపై అధికారిక సమాచారం లేదు. కాగా, రజనీకాంత్ ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్’ చిత్రంలో నటిస్తున్నారు.
Go Back to Shorts
Rajinikanth
super star
baba
movie
re release

More Telugu News