నా కొడుకుని ఐటీ అధికారులు కొట్టారు: మంత్రి మల్లారెడ్డి

IT officials beaten my son says Malla Reddy
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి
  • కొడుకును చూసేందుకు ఆసుపత్రికి వచ్చిన మల్లారెడ్డి
  • తన కొడుకుని ఐటీ అధికారులు వేధించారని మండిపాటు
తెలంగాణ రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. ఛాతీ నొప్పికి గురైన ఆయన హైదరాబాద్ లోని సూరారంలో ఉన్న ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డి ఆసుపత్రి వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఐటీ అధికారులు తన కొడుకుని ఐటీ రెయిడ్స్ పేరుతో వేధించారని ఆరోపించారు. తన కొడుకుని ఐటీ అధికారులు కొట్టారని, అందుకే ఆయన ఆసుపత్రిపాలు అయ్యారని అన్నారు. రాత్రంతా సీఆర్పీఎఫ్ బలగాలతో కొట్టించారని చెప్పారు. తాము దొంగ వ్యాపారాలు చేయడం లేదని... కాలేజీలను స్థాపించి సేవ చేస్తున్నామని చెప్పారు. ఎన్నో ఏళ్లపాటు కష్టపడితే ఈ స్థాయికి చేరుకున్నామని అన్నారు. కష్టపడి సంపాదించి, నిజాయతీగా బతుకుతున్నామని చెప్పారు. బీజేపీ కేంద్ర వ్యవస్థలతో అక్రమంగా దాడులు చేయిస్తోందని అన్నారు.

రాజకీయ కక్షతోనే ఐటీ దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. కావాలనే తమపై ఐటీ దాడులు చేస్తున్నారని... 200 మంది ఐటీ అధికారులతో తమపై ఐటీ దాడులు చేయించి భయపెట్టాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు ఆసుపత్రికి మల్లారెడ్డితో పాటు ఐటీ అధికారులు కూడా వచ్చారు.
Go Back to Shorts
Ch Malla Reddy
TRS
Son
Hospital
IT Raids

More Telugu News