భద్రాచలంలో ఘోరం... గుత్తికోయల దాడిలో ఫారెస్ట్ రేంజర్ మృతి
- ఎర్రగూడు అటవీప్రాంతంలో గిరిజనుల పోడు వ్యవసాయం
- పోడు భూముల్లో మొక్కలు నాటిని అటవీశాఖ
- అధికారులతో గుత్తికోయల వాగ్వాదం
- ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావుపై వేటకొడవళ్లతో దాడి
గతంలో ఓసారి ఫారెస్ట్ అధికారులకు, గుత్తికోయలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా, లాఠీచార్జి కూడా చేయాల్సి వచ్చింది. తాజాగా, ఫారెస్ట్ అధికారులు ఆ భూముల్లో మరోసారి మొక్కలు నాటగా, వాటిని ధ్వంసం చేసేందుకు గిరిజనులు యత్నించారు.
ఈ క్రమంలో ఫారెస్ట్ రేంజర్ చలమల శ్రీనివాసరావు (42) అడ్డుకోగా, గుత్తికోయలు ఆయనపై వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాసరావు తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను అటవీశాఖ సిబ్బంది కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆ ఫారెస్ట్ రేంజర్ ప్రాణాలు వదిలారు.