ఫ్రాన్స్ అధ్యక్షుడి చెంప ఛెళ్లుమనిపించిన మహిళ... వీడియో ఇదిగో!
- టైన్ మెర్మిటేజ్ టౌన్ లో ఓ కార్యక్రమానికి హాజరైన మాక్రాన్
- అక్కడున్న కొంత మందితో మాట్లాడేందుకు వెళ్లినప్పుడు ఘటన
- ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు
న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం... ఫ్రాన్స్ లోని డ్రోమ్ రీజియన్ లోని టైన్ హెర్మిటేజ్ టౌన్ లో ఫుడ్, రెస్టారెంట్ ఇండస్ట్రీకి సంబంధించిన ఓ కార్యక్రమానికి అధ్యక్షుడు హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలను మరింత సరళతరం చేసిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న కొంత మంది వద్దకు మాక్రాన్ వెళ్లారు. ఇంతలో ఊహించని విధంగా మాక్రాన్ చెంపను అక్కడున్న ఒక మహిళ ఛెళ్లుమనిపించింది. అక్కడున్న ఓ వ్యక్తితో మాట్లాడేందుకు మాక్రాన్ ప్రయత్నిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో సదరు మహిళతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో కూడా మాక్రాన్ కు ఇలాంటి అనుభవమే ఎదురైంది.