హీరో నాగశౌర్య రూ. 50 కోట్ల కట్నం తీసుకున్నాడంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం

Actor Naga Shaurya dowry
  • బెంగళూరుకు చెందిన అనూష శెట్టిని పెళ్లాడిన నాగశౌర్య
  • చాలా కాలంగా ప్రేమలో ఉన్న జంట
  • అనూష పేరుమీద చాలా ఆస్తులు ఉన్నాయని ప్రచారం
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఒక ఇంటివాడు అయిన సంగతి తెలిసిందే. బెంగళూరుకు చెందిన అనూష శెట్టిని వివాహం చేసుకున్నాడు. అనూష ఒక బిజినెస్ విమెన్. ఇంటీరియర్ డిజైనర్ గా అవార్డును సైతం అందుకుంది. వీరిద్దరూ చాలా కాలం నుంచి ప్రేమలో ఉన్నప్పటికీ... ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారు. 

మరోవైపు, నాగశౌర్యకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. నాగశౌర్యకు మామగారు ఎంత ఇచ్చారు? ఏం ఆస్తులు ఇచ్చారు? అనేదే ఆ చర్చ. రూ. 40 కోట్ల నుంచి రూ. 50 కోట్ల వరకు కట్నం ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. అనూష పేరు మీద కూడా చాలా ఆస్తులు ఉన్నాయట. వాటిలో కూడా చాలా వాటిని నాగశౌర్య పేరు మీద రాశారట. మరోవైపు, ఇది ప్రేమ వివాహం కాబట్టి కట్నం తీసుకోకపోయుండొచ్చని మరి కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
Go Back to Shorts
Naga Shaurya
Marriage
Dowry
Tollywood

More Telugu News