నేడు భారత్–న్యూజిలాండ్ రెండో టీ20.. వరుణుడు ఆడనిస్తాడా?
- ఈ మ్యాచ్‌కూ వాన ముప్పు
- ఇప్పటికే వర్షంతో తొలి మ్యాచ్ రద్దు
- మ. 12 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యక్ష ప్రసారం
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని భారత్ ఈ సిరీస్ లో పలువురు యువ ఆటగాళ్లను పరీక్షించాలని చూస్తోంది. శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, ఉమ్రాన్ మాలిక్ కివీస్ గడ్డపై అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తన సత్తాచాటుకొని ఈ ఫార్మాట్‌లో జట్టులో చోటు నిలుపుకోవాలని చూస్తున్నాడు. భారత్ మాదిరిగా న్యూజిలాండ్ కూడా టీ20 వరల్డ్ కప్ సెమీస్ ఓటమి బాధను మరిచి తిరిగి గాడిలో పడాలని ఆశిస్తోంది. మరి, వరుణుడు కరుణించి మ్యాచ్ సాఫీగా సాగుతుందో లేదో చూడాలి.