కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా అరుణ్ గోయల్

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా అరుణ్ గోయల్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల కమిషనర్ గా అరుణ్ గోయల్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం లభించినట్టు వెల్లడించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. 

అరుణ్ గోయల్ 1985 బ్యాచ్ కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయన సర్వీసులో ఉండగానే స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) తీసుకున్నారు. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ గా రాజీవ్ కుమార్ వ్యవహరిస్తున్నారు. ఆయన గత మే నెలలోనే సీఈసీ పదవీ బాధ్యతల్లోకి వచ్చారు.

Arun Goyal
Election Commissioner
CEC
India

More Telugu News