ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాలు.. 17 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం
- ఓలా, ఆథర్, హీరో వంటి 17 సంస్థలతో ప్రభుత్వం ఒప్పందం
- ఏడాదికి లక్ష వాహనాలు అందించాలని లక్ష్యం
- దరఖాస్తు చేసుకునేందుకు ప్రత్యేక యాప్ తీసుకొచ్చిన నెడ్‌క్యాప్
ఉద్యోగులకు ఏడాదిలో కనీసం లక్ష వాహనాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ (నెడ్‌క్యాప్) తెలిపింది. విద్యుత్ వాహనాల కోసం 26 జిల్లాల్లోని అధికారులు దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఓ ప్రత్యేక యాప్‌ను నెడ్‌క్యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా వాహనాలను కోరుకునే ఉద్యోగులు దరఖాస్తు చేసుకోవచ్చు.