రూ. 19.5 కోట్లు పలికిన ఫుట్ బాల్ బంతి.. ప్రత్యేకత ఇదే!
- సాకర్ దిగ్గజం మారడోనా 'హ్యాండ్ ఆఫ్ గాడ్' గోల్ చేసిన ఫుట్ బాల్ కు భారీ ధర
- 1986 ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్లో ఇంగ్లండ్ పై ఈ గోల్ కొట్టిన మారడోనా
- 2020లో కన్నుమూసిన సాకర్ మాంత్రికుడు
నాటి మ్యాచ్ లో రిఫరీగా ఉన్న అలీ బిన్ నాసర్ దగ్గరే ఈ బంతి ఉండిపోయింది. ట్యునీషియాకు చెందిన అలీ బిన్ బంతిని వేలంలో పెట్టాలని నిర్ణయించారు. లండన్‌లోని గ్రాహమ్ బడ్ వేలం సంస్థ నిర్వహించిన వేలంలో ఈ బంతి భారీ మొత్తానికి అమ్ముడైంది. కాగా, హ్యాండ్ ఆఫ్ గాడ్ గోల్ చేసేప్పుడు మారడోనా వేసుకున్న జెర్సీ ఈ మేలో జరిగిన వేలంలో దాదాపు రూ. 75 కోట్లు పలికింది. తన ఆటతో సాకర్ అభిమానులను ఉర్రూతలూగించిన మారడోనా 2020లో మరణించాడు.