Komatireddy Raj Gopal Reddy: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కార్యాలయంలో రాష్ట్ర జీఎస్టీ సోదాలు

బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర జీఎస్టీ అధికారులు తనిఖీలను నిర్వహించారు. ఆయనకు చెందిన సుశి ఇన్ఫ్రా కంపెనీ కార్యాలయంలో సోదాలను నిర్వహించారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న కార్యాలయంతో పాటు హైదరాబాద్ లో పలు చోట్ల తనిఖీలు చేశారు. సుశి ఇన్ఫ్రా సంస్థకు రాజగోపాల్ రెడ్డి సోదరుడు సంకీర్త్ రెడ్డి ఎండీగా వ్యవహరిస్తున్నారు. ఉదయం ప్రారంభమైన తనిఖీలు మధ్యాహ్నం వరకు కొనసాగాయి. తనిఖీల్లో ఏం దొరికాయన్న విషయాన్ని అధికారులు ఇంకా వెల్లడించాల్సి ఉంది.
Komatireddy Raj Gopal Reddy
Company
GST Raids

More Telugu News