బన్నీ మెచ్చిన కథలో రామ్!
- ఆ మధ్య బన్నీకి ఒక కథ చెప్పిన బోయపాటి
- 'పుష్ప 2' కారణంగా చేయలేకపోయిన బన్నీ
- రామ్ తో బోయపాటి చేసేది అదే కథ అంటూ టాక్
- హైదరాబాదులో జరుగుతున్న షూటింగు
- కథానాయికగా అలరించనున్న శ్రీలీల
కానీ కొన్ని కారణాల వలన 'పుష్ప 2'ను గ్యాప్ లేకుండానే సెట్స్ పైకి తీసుకుని వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా షూటింగు పూర్తయ్యేవరకూ వెయిట్ చేయాలంటే బోయపాటి చాలాకాలం పాటు వెయిట్ చేయవలసి వస్తుంది. అందువలన అదే కథతో ఆయన రామ్ తో చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇది బన్నీ మెచ్చిన కథ అనే చెప్పుకుంటున్నారు.
గతంలో బన్నీ - బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'సరైనోడు' సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందనేది తెలిసిందే. అంతకుమించి అన్నట్టుగానే ఆ తరువాత కథను కూడా బోయపాటి రెడీ చేసి ఉంటాడు. అందువలన ఈ సినిమాపై అంచనాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా శ్రీలీల నటిస్తోంది. ఉగాదికి ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.