మరో 4 రోజుల్లో 800 కోట్లకు చేరుకోనున్న ప్రపంచ జనాభా.. వచ్చే ఏడాది చైనాను అధిగమించనున్న భారత్!
- ఈ నెల 15 నాటికి 800 కోట్లకు పెరగనున్న ప్రపంచ జనాభా
- 2080 నాటికి వెయ్యి కోట్లు దాటనున్న జనాభా
- 50 శాతానికి పైగా జనాభా వృద్ధి కేవలం 8 దేశాల్లోనే
2050 నాటికి ప్రపంచ జనాభా 970 కోట్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. 2080 నాటికి జనాభా వెయ్యి కోట్లను దాటుతుందని... 1,040 కోట్లకు చేసుకుంటుందని తెలిపింది. 2100 నాటికి 1,120 కోట్లను దాటుతుందని వెల్లడించింది. ప్రపంచ జనాభా వృద్ధిలో 50 శాతానికి పైగా కేవలం 8 దేశాల్లోనే సంభవిస్తోందని తెలిపింది. భారత్, నైజీరియా, ఇథియోపియా, ఈజిప్ట్, కాంగో, ఫిలిప్పీన్స్, పాకిస్థాన్, టాంజానియా దేశాల్లో అధిక జనాభా వృద్ధి రేటు ఉందని వెల్లడించింది.