షిర్డీ సాయి భక్తులకు అద్భుత అవకాశం.. సాయి సమాధిని స్పృశించే అవకాశం!
- ఇప్పటి వరకు వీఐపీ భక్తులకు మాత్రమే సాయి సమాధిని తాకే అవకాశం
- సాధారణ భక్తులకు, సమాధికి మధ్య గాజు అద్దం
- సాయి సంస్థాన్ తాజా నిర్ణయంపై భక్తుల హర్షం
నిజానికి ఒకప్పుడు సాయి సమాధిని తాకే అవకాశం అందరికీ ఉండేది. అయితే, భక్తుల రద్దీ నేపథ్యంలో ఆ తర్వాత భక్తులకు, సాయి సమాధికి మధ్య గాజు అద్దాన్ని అడ్డుగా పెట్టారు. దీంతో అప్పటి నుంచి సాయి సమాధిని స్పృశించే అవకాశం సాధారణ భక్తులకు లేకుండా పోయింది. తాజాగా, మరోమారు ఆ అవకాశాన్ని తీసుకురావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.