రేపు విశాఖకు పవన్... ప్రధాని మోదీతో జనసేనాని భేటీ

janasena chief pawan kalyan will meet pm narendra modi in vizag tomorrow
  • రేపు విశాఖ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ
  • మోదీతో భేటీ కోసం రేపు విశాఖ వెళ్లనున్న పవన్ కల్యాణ్
  • ఏపీలోని పరిస్థితులను మోదీకి వివరించనున్న జనసేనాని
ఏపీ పర్యటనకు రానున్న భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలోని విశాఖలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విశాఖ రానున్న ప్రధానితో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ రేపు విశాఖ పర్యటనకు బయలుదేరనున్నారు. హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న పవన్... నేరుగా విశాఖ చేరుకుంటారు. 

విశాఖ చేరిన తర్వాత శుక్రవారమే పవన్ కల్యాణ్ ప్రధానితో బేటీ అవుతారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయాలు, రాష్ట్రంలోని శాంతి భద్రతల పరిస్థితులపై ఆయన ప్రధానికి వివరించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పవన్ 2 రోజుల పాటు విశాఖలోనే వుంటారు. అయితే ప్రధాని అధికారిక కార్యక్రమాలకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా హాజరు కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మోదీ పాల్గొనే అధికారిక కార్యక్రమాలకు పవన్ హాజరవుతారా? లేదా? అన్న వివరాలు తెలియరాలేదు.
Go Back to Shorts
Vizag
Andhra Pradesh
BJP
Prime Minister
Narendra Modi
YSRCP
YS Jagan
Janasena
Pawan Kalyan

More Telugu News